హైదరాబాద్‌ ప్రేమకి `పీఎస్‌2` నిర్మాత ఫిదా.. థ్యాంక్స్ చెబుతూ ట్వీట్‌.. `పొన్నియిన్‌ సెల్వన్‌`కి మూలం అదే!

`పొన్నియిన్‌ సెల్వన్ 2` ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. తాజాగా హైదరాబాద్‌కి థ్యాంక్స్ చెప్పారు నిర్మాత. ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. 

ps2 producer says thanks to hyderabad with emotional note arj

ఛోళ సామ్రాజ్య చరిత్ర ఆధారంగా దర్శకుడు మణిరత్నం `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. విక్రమ్‌, కార్తి, జయంరవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, శోభితా దూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి భాగం గతేడాది వచ్చి అలరించింది. కానీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండో పార్ట్ విడుదల కాబోతుంది. `పీఎస్‌2` ఈ నెల 28న విడుదల కాబోతుంది. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం `పీఎస్‌2` టీమ్‌ సందడి చేసింది. భారీగా ఈవెంట్‌ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో విక్రమ్‌, కార్తి, జయంరవి, ఐశ్వర్య, త్రిష వంటి ప్రధాన తారాగణం పాల్గొంది. వీరితోపాటు దర్శకుడు మణిరత్నం, లైకా నిర్మాత సుభాస్కరణ్‌ పాల్గొన్నారు. సినిమా విశేషాలను, తెలుగు సినిమాలు, టాలీవుడ్‌, హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు. తెలుగు నుంచి నిర్మాత దిల్‌ రాజు, రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌, రైటర్స్ పాల్గొన్నారు. ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగిన నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌కి థ్యాంక్స్ చెప్పారు లైకా నిర్మాతలు. `థ్యాంక్యూ హైదరాబాద్‌, ప్రేమ, శక్తి నిజంగా అద్భుతం` అంటూ ట్వీట్‌ చేసింది లైకా సంస్థ. ఈవెంట్‌లోని హైలైట్‌ మూమెంట్స్ ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఇది వైరల్‌ అవుతుంది. 

ఇక ఈవెంట్‌లో మణిరత్నం మాట్లాడుతూ `పొన్నియిన్‌ సెల్వన్‌` సినిమాకి మూల కారణం ఏంటో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. రాజమౌళి `బాహుబలి` సినిమాని రెండు భాగాలుగా చేయకపోయి ఉంటే ఇప్పుడు `పొన్నియిన్‌ సెల్వన్‌` ఉండేది కాదు, మేం చేసేవాళ్లం కాదని, ఆయన ఇచ్చిన ధైర్యం, మార్గంతోనే ఈ సినిమా సాధ్యమైందన్నారు మణిరత్నం. ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా అందాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

`పొన్నియిన్‌ సెల్వన్‌ 2` సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కాబోతుంది. తొలి చిత్రంపై మిశ్రమ స్పందన లభించిన నేపథ్యంలో రెండో పార్ట్ ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు వీక్‌ పబ్లిసిటీ కూడా ఈ సినిమాకి తెలుగులో మైనస్‌గా నిలవొచ్చు. ఇక్కడ అదే సమయంలో `ఏజెంట్‌` రిలీజ్‌ కానుంది. ఈ సినిమా బాగుంటే `పీఎస్‌2`కి గట్టి దెబ్బ పడబోతుందని చెప్పొచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios