ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ప్రాజెక్ట్ కే మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర కథపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నిర్మాత కొంత హింట్ ఇచ్చారు.
ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ప్రాజెక్ట్ కే. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర కథ, జానర్ పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. స్పష్టమైన సమాచారం లేదు. ప్రముఖంగా సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఇచ్చారని. లార్డ్ కృష్ణ ప్రస్తావనతో కూడిన సోషియో ఫాంటసీ చిత్రమని తాజాగా నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీ దత్... ప్రాజెక్ట్ కే మూవీలో లార్డ్ విష్ణు. ఫాంటసీ అంశాలు ఉంటాయి. అయితే సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అన్నారు.
కాబట్టి ఈ మూవీలో లార్డ్ విష్ణు ప్రస్తావన ఉంటుంది.నిర్మాత ఫాంటసీ అంటున్నారు కాబట్టి ఇది సూపర్ హీరో మూవీ కూడా కావచ్చంటున్నారు. ఇంత పెద్ద సోసియో ఫాంటసీ యాక్షన్ మూవీలో ఆ సెంటిమెంట్ కోణం ఏమిటనేది ఆసక్తికరం. ఇక ప్రాజెక్ట్ కే లో సైన్స్ అంశాలతో కూడా కూడిన వండర్స్. పురాణాలు, దేవుళ్ళ ప్రస్తావన కూడా ఉందనిపిస్తుంది. అశ్వినీ దత్ మాటలు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక ప్రభాస్ సూపర్ హీరోనా కదా? అనే విషయంలో క్లారిటీ లేదు. నాగ అశ్విన్ మాత్రం ఇదో లార్జర్ దెన్ లైఫ్ మూవీ. పాన్ వరల్డ్ చిత్రమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రాజెక్ట్ కే విడుదల తేదీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. దిశా పటాని సెకండ్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెలల వ్యవధిలో ప్రభాస్ మూడు భారీ చిత్రాలు విడుదల చేయనున్నారు. జూన్ 16న ఆదిపురుష్ విడుదల కానుంది. మరో మూడు నెలలకు సెప్టెంబర్ 28న సలార్ థియేటర్స్ లోకి వస్తుంది. అనంతరం నాలుగు నెలలకు ప్రాజెక్ట్ కే విడుదల చేస్తారు.
మరోవైపు దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్నారు. అది కూడా సెట్స్ పై ఉంది. రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుకున్నారు.
