గతేడాది మొత్తం దిల్ రాజు ఎలాంటి సినిమా తీసినా.. వర్కవుట్ అవ్వలేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా బాగా నష్టపోయాడు. కానీ కొత్త ఏడాది ఆయనకి మంచి బూస్టప్ లభించింది. 'ఎఫ్ 2' సినిమాతో ఆయనకు మంచి లాభాలు వచ్చాయి.

దాదాపు పది కోట్ల రూపాయలు ఆయన ఖాతాలో చేరినట్లు సమాచారం. ముప్పై కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా రూ.8 కోట్లు రాగా, సీడెడ్, ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, నెల్లూరు అమ్మకాల ద్వారా మరో ఇరవై కోట్లు వచ్చాయి.

ఇక మిగిలిన ఏరియాల మీద 12 కోట్ల షేర్ దాటేసింది. పైగా ఈ వారం సినిమాలు కూడా లేకపోవడంతో 'ఎఫ్ 2'కి మరింత కలిసొస్తుంది. మరో వారం రోజులు ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో ఎలా లేదన్నా.. దిల్ రాజుకి పదిహేను కోట్లు మిగులుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇది ఇలా ఉండగా.. 'వినయ విధేయ రామ' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం వలన నాలుగైదు కోట్లు నష్టం తప్పేలా లేదు. 'ఎఫ్ 2' ద్వారా వచ్చిన లాభాలు, 'వినయ విధేయ రామ'తో వచ్చిన నష్టాలు చూసుకుంటే దిల్ రాజుకి పది కోట్లు మిగిలేలా కనిపిస్తోంది.   

F2 కలెక్షన్స్: 20 కొట్టేశారుగా!

'ఎఫ్ 2': ఫ్యాన్స్ వార్... క్రెడిట్ ఏ హీరోకి చెందాలి?

'ఎఫ్ 2' సెకండ్ డే కలెక్షన్స్!

'ఎఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఫన్ .. సంక్రాంతి విన్ (ఎఫ్‌2 రివ్యూ)

ప్రీమియర్ షో టాక్: F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) 

'ఎఫ్ 2' మూవీ ట్విట్టర్ రివ్యూ..!