టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న నటుడి భార్య నిర్మాతలను ఇబ్బంది పెడుతుందని సమాచారం. తండ్రి బ్యాకప్ తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా గుర్తింపు పొందిన అతడి వ్యవహారాలన్నీ అతడి భార్యే దగ్గరుండి చూసుకుంటుంది.

రెమ్యునరేషన్, అతడు చేసే ప్రోగ్రామ్ లు, యాడ్స్ ఇలా ప్రతి ఒక్క విషయంలో భార్య ప్రమేయం ఉండాల్సిందే. అక్కడ వరకు ఓకే  గానీ సదరు హీరో నటించే సినిమాల షూటింగ్ విదేశాల్లో జరిగే సమయంలో హీరో గారి ఫ్యామిలీ మొత్తం విదేశాల్లో వాలిపోతుంది. వారందరికీ విమానపు ఖర్చులు, హోటల్ బిల్స్ అన్నీ కూడా నిర్మాత ఖాతాలోనే అని సమాచారం.

పైగా హీరోగారి భార్య తన తరఫు బంధువులను తన వెంట బెట్టుకొని తీసుకురావడం వంటి పనులు చేస్తుందని తెలుస్తోంది. వీరికి పెట్టిన ఖర్చే కాకుండా వారి బంధువులకి కూడా ఖర్చు పెట్టాల్సి రావడంతో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.

కానీ చేసేదేం లేక వారి అవసరాలన్నీ తీరుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె నిర్మాతలను ఈ విధంగానే ఇబ్బంది పెట్టిందని కొందరు నిర్మాతలు ఈ హీరోతో సినిమా అంటే వెనుకడుగు కూడా వేస్తున్నారని సమాచారం.