సినిమాకి నాలుగు నుండి ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరో నాని తన కొత్త సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. 
ప్రస్తుతం నాని హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం. శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి నాని రెమ్యూనరేషన్ కాకుండా.. లాభాల్లో వాటా తీసుకునే పద్దతికి రెడీ అవుతున్నాడు.

ఈ మధ్యకాలంలో హీరోలు ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. నానికి కథ బాగా నచ్చడంతో సినిమాని మరింత ఖర్చుతో తీయమని, తనకి రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇవ్వమని నిర్మాతకి చెప్పేశాడట. 

నాని ఇలాంటి ప్రపోజల్ పెట్టడంతో బడ్జెట్ లో తీయాలనుకున్న ఈ సినిమా పరిధిని పెంచినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని రంగంలోకి దింపారు. సెట్ వర్క్, సీజీ వర్క్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.