Asianet News TeluguAsianet News Telugu

నెట్ఫ్లిక్స్ లో సలార్... అన్ని కోట్లకు డీల్?

సలార్ విడుదల సమీపిస్తుండగా నిర్మాతలు ఒక్కో బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు. సలార్ ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. 
 

producers closes prabhas starer salaar ott deal with Netflix ksr
Author
First Published Nov 7, 2023, 3:17 PM IST

సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు పలు కారణాలు వినిపంచాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో పోస్ట్ ఫోన్ చేశారనే వాదన తెరపైకి వచ్చింది. అలాగే సీజీ వర్క్ పట్ల అసంతృప్తిగా ఉన్న ప్రశాంత్ నీల్ మరింత సమయం తీసుకోవాలని భావించారట. ఇక సలార్ కొత్త విడుదల తేదీగా డిసెంబర్ 22 ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా సలార్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 

సలార్ పై భారీ హైప్ నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 175 కోట్లకు అమ్మారని సమాచారం. దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వస్తే కానీ ఈ మూవీ ఏపీ/తెలంగాణాలలో హిట్ కాదు. అంతటి భారీ టార్గెట్ ప్రభాస్ ముందుంది. ఇదిలా ఉంటే... డిజిటల్ రైట్స్ కూడా క్లోజ్ చేశారట. 

నిర్మాతలు రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తుండగా... ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. వరుస నష్టాలతో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పెట్టుబడి తగ్గించాయి. గతంలో మాదిరి అడిగినంత ఇచ్చే పరిస్థితి లేదు. అయితే నెట్ఫ్లిక్స్ బెటర్ ప్రైస్ ఇవ్వడంతో సలార్ హక్కులు వారికి కట్టబెట్టారని టాక్. సలార్ చిత్ర అన్ని భాషల హక్కులను నెట్ఫ్లిక్స్ రూ. 160 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. సలార్ సైతం రెండు భాగాలుగా విడుదల కానుందని అంటున్నారు. అలాగే కెజిఎఫ్ సిరీస్ తో లింక్ ఉన్న కథే అని ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ ఇవ్వని ప్రశాంత్ నీల్... సలార్ చూసి ఆ విషయం కన్ఫర్మ్ చేసుకొమ్మని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios