ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ గురించి స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మరోమారు చర్చకు తెరలేపారు. గురువారం తన తండ్రి రామానాయుడు జయంతి సందర్భంగా సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఏపీలో చిత్ర పరిశ్రమ ఏర్పాటుపై చర్చ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఐదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏపీలో ఒక్క స్టూడియో నిర్మాణం కూడా జరగలేదు. స్టూడియో నిర్మాణానికి ముందుకు వస్తే అమరావతిలోని భూములు ఇస్తాం అంటూ గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. 

కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతిలోని చిత్ర పరిశ్రమ అని గత ప్రభుత్వం తెలిపినా సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్యూసర్స్ వైజాగ్ వైపు మొగ్గుచూపారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం వల్లే స్టూడియో నిర్మించలేకపోయామని సురేష్ బాబు అభిప్రాయ పడ్డారు. త్వరలో సీఎం జగన్ ని కలవాలనుకుంటున్నా. 

ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి కనీసం జగన్ గారైనా స్పష్టమైన ప్రకటన చేయాలి అని సురేష్ బాబు అన్నారు. ఏపీలో స్టూడియో ఉంటే సినిమాలపై ఆసక్తి ఉన్న యువత హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం ఉండదని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలో వైజాగ్ లేదా అమరావతి అనే గందరగోళాన్ని తొలగించాలని కోరారు.