Producer SKN : మళ్లీ ‘బేబీ’ సినిమా షూటింగ్ షురూ.... ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ చెప్పిన నిర్మాత ఎస్కేఎన్!
‘బేబీ’ సినిమా తెలుగులో ఎంతటి సక్సెస్ ను అందుకుందో తెలిసిందే.. ఈ చిత్రం మళ్లీ నిర్మించబోతున్నట్టు నిర్మాత ఎస్కేఎన్ చెప్పారు. తాజాగా క్రేజీ అప్డేట్ అందించారు.

టాలీవుడ్ లో నిర్మాత ఎస్కేన్ చిన్న సినిమాలను నిర్మిస్తూ మంచి ఫలితాన్ని చూస్తున్నారు. చివరిగా ‘బేబీ’ సినిమాతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు (SKN) సక్సెస్ అందుకున్నారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదరహో అనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్, సక్సెస్ మీట్ల సమయంలో నిర్మాత ఎస్కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఆడియెన్స్ కు గుర్తిండిపోయారు.
ఇక రీసెంట్ గా ఎస్కేఎన్ తండ్రి కన్నుమూయడంతో కొద్దిరోజులు సినిమా పనులకు దూరంగా ఉన్నారు. అన్నీ కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ తను నిర్మించబోతున్న సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఎస్కేఎన్ ఓ తమిళ చిత్రం True Lover సినిమాను తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఎస్కేఎన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
త్వరలోనే ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నామని.. మళ్లీ షూటింగ్ మొదలు కానుందని చెప్పారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రీమేక్ కు సంబంధించిన అప్డేట్ ను ఇస్తామన్నారు. మరీ ఆ చిత్రంలో నటించబోయే జంట ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అలాగే తమిళంలోనూ రీమేక్ చేస్తామన్నారు. ఇక ఇప్పటికే ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రారంభమైనట్టు సమాచారం.
బేబీ మూవీ తర్వాత నిర్మాత ఎస్కేఎన్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. వాటిలో సంతోష్ శోభన్ (Santosh Shoban), అలేఖ్య హారిక (Alekya Harika) జంటగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అలాగే ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు రీమేక్ పై అప్డేట్ ఇచ్చారు. నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ ను ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.