క్రేజీ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్ SKN నెక్ట్స్ ప్రాజెక్ట్స్.. ఏకంగా నాలుగు సినిమాలు.. దర్శకులు ఎవరంటే?
నిర్మాత SKN తన బ్యానర్ లో ఏకంగా నాలుగు సినిమాలను నిర్మించబోతున్నారు. ఈ ఫొటో షేర్ చేస్తూ ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇద్దరు డైరెక్టర్లతో ప్రాజెక్ట్స్ ఓకే చేయించడం ఆసక్తికరంగా మారింది.
‘బేబీ’ సినిమాతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు (SKN) ఎలాంటి ఫలితం అందుకున్నారో తెలిసిందే. రూ.90 కోట్ల వరకు కలెక్షన్లు అందుకున్నారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో దర్శకుడు సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మరింత పాపులర్ అయ్యారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు సక్సెస్ మీట్లలో తనదైన శైలిలో స్పీచ్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ జాబితాలో చేరిపోయారు. ఈ క్రమంలో SKN నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనా ఆసక్తి నెలకొంది.
ఇక తాజాగా ఎస్కేఎన్ స్వయంగా తను నిర్మించబోయే చిత్రాల గురించి అప్డేట్ అందించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నలుగురు యంగ్ డైరెక్టర్స్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. తన ఎంతగానో నమ్మిన స్నేహితులతో సినిమా జర్నీ అందంగా ఉంటుందని రాసుకొచ్చారు. వీరితోనే నాలుగు ప్రాజెక్ట్స్ రూపొందించబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
ఎస్కేఎన్ పంచుకున్న ఫొటోలో యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్, సందీప్ రాజ్ ఉన్నారు. మరో ఇద్దరు సుమన్ పాతూరి, రవితోనూ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటికే ‘కలర్ ఫొటో’తో సందీప్ రాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు దక్కడం విశేషం. ఇక సాయి రాజేశ్ ‘బేబీ’తో దుమ్ములేపారు. వీరిద్దరితో SKN ఎలాంటి సినిమాలను తీసుకురాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ హీరోలు ఎవరు, బడ్జెట్ సైజ్ ఎంతనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. మరో ఇద్దరిని దర్శకులుగా తన బ్యానర్ నుంచి పరిచయం చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. రైటర్ గా ఉన్న రవిని, సుమన్ పాతూరితో సినమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. యంగ్ డైరెక్టర్ట్స్ తో నమ్మడంతో పాటు వారి నుంచి మంచి అవుట్ పుట్ తీసుకుంటున్నారు ఎస్కేఎన్. అలాగే సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు.