ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడి అనుమానాస్పద మృతి!

producer's son suspicious death
Highlights

కంబలి వద్ద సముద్రంలో ఆయన మృత దేహం కొట్టుకు వచ్చింది

నిర్మాతగా ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి నెల్లూరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కంబలి వద్ద సముద్రంలో ఆయన మృత దేహం కొట్టుకు వచ్చింది. కొడుకు భార్గవ్ పేరు మీద భార్గవ్ ఆర్ట్స్ అనే బ్యానర్ ను శాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు ఎస్.గోపాల్ రెడ్డి. ఆయన మరణించిన తరువాత కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇండస్ట్రీలో కొనసాగలేదు. ఆయన మరణించి దాదాపు పదేళ్ళు అవుతుంది.

అయితే ఇప్పుడు ఆయన తనయుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈ మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎలా చనిపోయాడనే తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడా..? ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. 

loader