Asianet News TeluguAsianet News Telugu

స్పెర్మ్ దానం చేస్తున్న బెల్లంకొండ హీరో.. `స్వాతి ముత్యం`లో అసలు ట్విస్ట్ రివీల్డ్..

బెల్లంకొండ హీరో గణేష్‌ హీరోగా ఎంట్రీ ఇస్తూనే ప్రయోగం చేశాడు. ఆయన ఓ ఊహించని పాత్రలో కనిపించబోతున్నారు. `స్వాతిముత్యం`లో ఆయన పాత్ర ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

producer nagavamshi revealed main story twist in swathimuthyam movie hot comment on his
Author
First Published Oct 1, 2022, 4:54 PM IST

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రెండో కుమారు గణేష్‌ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన `స్వాతిముత్యం` చిత్రంతో రాబోతున్నారు. ఆయన స్పెర్మ్ దానం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. తాను నటిస్తున్న `స్వాతిముత్యం` చిత్రంలో స్పెర్మ్ దాతగా కనిపించబోతున్నారట. ఈ చిత్రం స్పెర్మ్ డొనేషన్‌ కాన్నెప్ట్ తో తెరకెక్కుతుండటం విశేషం. వర్ష బొల్లమ్మ హీరోగా నటిస్తుండగా, లక్ష్మణ్‌ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 

`స్వాతిముత్యం` అక్టోబర్‌ 5న దసరా కానుకగా విడుదల కాబోతుంది. చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌`, నాగార్జున `ది ఘోస్ట్` చిత్రాలతో పోటీ పడబోతుంది. అయితే సినిమా గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్పెర్మ్ డోనర్‌ కాన్సెప్ట్ తో తెలుగులో సినిమాలు రాలేదుని, `విక్కీ డోనర్‌` అనేది బాలీవుడ్‌లో మాత్రమే వచ్చిందని, దాని రీమేక్ తెలుగులో చేసినా అది అంతగా వర్కౌట్‌ కాలేదని, అందుకే దీన్ని తాము ప్రయోగాత్మకంగా తెరకెక్కించామని తెలిపారు. ఆ పాయింట్‌ని థియేటర్లో ఆడియెన్స్ ట్విస్ట్ గా ఫీలవుతారని, అలాగని ఎలాంటి వల్గారిటీకి తావులేదని చెప్పారు నాగవంశీ.

అయితే పూర్తి ఫన్‌తో, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుందని, ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా రాలేదని, దసరాకి కచ్చితంగా నవ్వుకునే చిత్రమవుతుందని వెల్లడించారు నిర్మాత. అందుకే `గాడ్‌ ఫాదర్‌`, `దిఘోస్ట్` సినిమాలతోపాటు విడుదల చేస్తున్నామని, అదే సమయంలో పండక్కి రెండు మూడు సినిమాలకు స్కోప్ ఉందని చెప్పారు. ఆ ధైర్యంతోనే రిస్క్ చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఒక్క రోజు ముందే అక్టోబర్‌ 4న తెలంగాణ, ఏపీలో ప్రీమియర్స్ వేయబోతున్నట్టు చెప్పారు. ఇటీవల `గాడ్‌ ఫాదర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి తమ సినిమా పేరుని ప్రస్తావించడంపై స్పందిస్తూ, అందుకే ఆయన చిరంజీవి అని, ఆయన చిన్న సినిమాలను కూడా ఆదరించాలని కోరుకుంటారని, అందుకే ఇండస్ట్రీ పెద్ద అయ్యారని వెల్లడించారు. 

సినిమాలో హీరో అమాయకుడిగా కనిపిస్తాడని, ఆయన పాత్రని బట్టి `స్వాతిముత్యం` అనే టైటిల్‌ పెట్టినట్టు చెప్పారు. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది. ఈ జనరేషన్‌లో ఉండాల్సిన వాడు కాదు, చాలా మంచోడు, ఓ రకంగా చెప్పాలంటే శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటివాడు అని తెలిపారు. 

తమ బ్యానర్‌లో పెద్ద సినిమాలతోపాటు కంటెంట్‌ ఉన్న చిన్న చిత్రాలు కూడా చేస్తామని, ప్రయోగాత్మకంగా చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం తమ బ్యానర్‌లో బాలకృష్ణ సినిమా, రవితేజతో ఓ సినిమా, వైష్ణవ్‌ తేజ్‌, నవీన్‌ పొలిశెట్టిలతో సినిమా చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్‌ బావమరిదితో ఓ కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా చేస్తున్నట్టు చెప్పారు నాగవంశీ. చిరంజీవితో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నామని తెలిపారు. 

ఇదిలా ఉంటే నాగవంశీ తనపై తాను ఓ బోల్డ్ కామెంట్‌ చేశారు. రియల్‌ లైఫ్‌లో మీరు ఎలాంటి వారు అని అడగ్గా, తాను స్వాతిముత్యం కాదన్నారు. ఆణిముత్యం కూడా కాదని, నేను పెద్ద `వె.. ` అంటూ షాకింగ్ కామెంట్‌ చేశారు. అయితే ఇదంతా ఆయన సరదాగా చెప్పడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios