మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్  మధ్య గొడవలు జరుగుతున్నాయని జరుగుతున్న మీడియా ప్రచారానికి  నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.  


సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీపై ప్రేక్షకులకు అనేక అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో అనుమానాలు ఉన్నాయి. సూపర్ హిట్స్ అరవింద సమేత, అలవైకుంఠపురం లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న త్రివిక్రమ్ తో మహేష్ బాబుతో సినిమా అనేసరికి మీడియా కూడా అటెన్షన్ కోసం రోజుకో వార్త వండి పారేస్తోంది. అతను, ఖలేజా చిత్రాల తరువాత మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు నిర్మాత నాగ వంశీకు కోపం తెప్పించినట్లున్నాయి. ఆయన సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని జరుగుతున్న మీడియా ప్రచారానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. 

ఇంతకీ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటీ అంటే... త్రివిక్రమ్ పనితీరు పట్ల మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని. అళాగే సంగీత దర్శకుడిగా తమన్, హీరోయిన్ గా పూజా హెగ్డే లని వద్దని సూపర్ స్టార్ చెబితే త్రివిక్రమ్ కన్వీన్స్ చేశారని... కథ మార్చమని కోరితే ఫుల్ స్క్రిప్ట్ చేంజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఫస్ట్ షెడ్యూల్ లో తీసిన ఫైట్ వద్దని మహేష్ చెబితే, అది తీసేసి ఏకంగా ఫైట్ మాస్టర్లను మార్చేశారని... ఇప్పుడు హీరో, హీరోయిన్ శ్రీలీల మీద తీసిన సీన్లు సరిగా రాలేదని, వాటిని పక్కనపెట్టి కొత్తగా తీద్దామని త్రివిక్రమ్ చెబితే మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తలను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఖండించారు. 

''ఆహారం కోసం వెతికేటప్పుడు పక్షులు గట్టిగా శబ్దం చేస్తాయి. ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు అదే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయడం సులభమే. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూపర్ ఫ్యాన్స్... SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి'' అని నాగవంశీ ట్వీట్ చేశారు.

మరో ప్రక్క కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు 28వ మూవీకి సంబంధించి తమన్ ఒక కాపీ ట్యూన్‌ కొట్టాడని.. అయితే అది మహేష్, త్రివిక్రమ్‌కి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్టు రూమర్స్ వచ్చాయి. దీనికి హర్ట్ అయిన థమన్.. SSMB28 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు పలు వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు మేకర్స్. అయితే మహేష్ మూవీ నుంచి థమన్ తప్పుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని.. ఇవి ఒట్టి పుకార్లు మాత్రమేనని థమన్ కౌంటర్ ఇస్తూ.. ట్వీటారు. తనపై వస్తున్న నెగిటివిటీకి క్రియేటివిటీ జోడిస్తూ సెటారికల్ ట్వీట్ పెట్టాడు థమన్.

ఇక మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.