విశాల్ మాటలు వింటుంటే ఇదో రకం సనాతన ధర్మం అనిపిస్తోంది.. నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
హీరో విశాల్ ప్రస్తుతం తాను నటించిన మార్క్ ఆంటోని చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా హిట్ గా నిలిచింది.

హీరో విశాల్ ప్రస్తుతం తాను నటించిన మార్క్ ఆంటోని చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా హిట్ గా నిలిచింది. దీనితో రిలీజ్ తర్వాత కూడా విశాల్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ మార్క్ ఆంటోని చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకువెళుతున్నాడు.
మార్క్ ఆంటోని చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ వర్తమాన నిర్మాతలకు సలహా ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నాలుగు కోట్లు చేతిలో పెట్టుకుని సినిమాలు తీయడానికి ఎవరూ రావొద్దు అంటూ విశాల్ వ్యాఖ్యానించాడు. విశాల్ వ్యాఖ్యలపై తమిళ నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ నిర్మించిన ‘ఎనక్కు ఎండే కిడైయాదు' చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో ఆయన విశాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మూడు నాలుగు కోట్లతో సినిమా చేసేందుకు ఎవరూ రావొద్దు అంటూ విశాల్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరైనవి కాదు అని కార్తీక్ అన్నారు. విశాల్ మాటలు వింటుంటే ఇదొక రకం సనాతనం ధర్మం ఏమో అనిపిస్తోంది అంటూ సెటైర్లు వేశారు.
సినిమా బడ్జెట్ అనేది కథని బట్టి డిమాండ్ ని బట్టి ఉంటుంది. ముందుగా నిర్ణయించుకునేది కాదు. ఇంత బడ్జెట్ లోనే సినిమా చేయాలనీ రూల్ లేదు. రూ 1 కోటి లోనూ సినిమా చేయొచ్చు లేదా 100 కోట్లు కూడా వెచ్చించవచ్చు అని కార్తీక్ అన్నారు. విశాల్ ఏది పడితే అది మాట్లాడకూడదు అని కార్తీక్ అన్నారు.