బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తనపై తాను సెటైర్లు వేసుకుంటూ.. మీడియాపై కూడా సరదాగా కొన్ని చలోక్తులు విసిరారు. తన పెళ్లి గురించి అడగడంలేదు అంటూ మీడియాను ప్రశ్నించారు కరణ్. 

లేటెస్ట్ గా కరణ్ జోహార్ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. కియారా అద్వానీ బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్‌ మూవీ జుగ్ జుగ్‌ జియో. ఈ మూవీ ట్రైలర్‌ ఆదివారం రిలీజైంది. ఇందులో ఆమె వరుణ్‌ ధావన్‌ సరసన నటిస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ కూడా కనిపించనున్నారు. ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా మూవీ క్యాస్ట్‌ సినిమా గురించి మాట్లాడారు. ఆ టైమ్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 

అయితే మీడియా అక్కడ ఉన్న హీరోయిన్ కియారా అద్వానిని తన పెళ్ళి గురించి ప్రశ్నించగా.. అప్పుడు పక్కనే ఉన్న కరణ్‌ జోహార్‌ స్పందించాడు. తనపై తాను సెటైర్లు వేసుకుంటూ.. మీడియాపై కుడా సెటైరికల్ గా మాట్లాడారు. మీరు నా పెళ్లి గురించి ఎందుకు అడగలేదు? నాకు 50 ఏళ్లు. నేను కూడా ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు. నేను పెళ్లికి అర్హుడిని కాదు అని అనుకుంటున్నారా? నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లికి టాలెంట్‌ అవసరం లేదు అవసరం కావాలి అని కరణ్‌ అన్నాడు.

కియారా అద్వాని పెళ్ళి గురించి మీడియా అడిగిన దానికి ముందుగా కరణ్ సమాధానం చెప్పారు. పెళ్లి చేసుకుని ఎప్పుడు సెటిల్ అవుతున్నారు అని మీడియా అడగ్గా. సెటిల్ అవ్వడం అంటే పెళ్ళి చేసుకోవడమా.. సంపాదన బాగా ఉంది, సినిమాలు చేస్తున్నాము, స్టార్ డమ్ ఉంది.. ఇది సెటిల్ అయినట్టు కాదా అని కియారా అద్వాని ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో కరణ్ జోహార్ కూడా అదే అర్ధం వచ్చేలా మాట్లాడారు. 

కాగా బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు కరణ్ జోహార్. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలతో స్టార్ ఇమేజ్ సాధించారు కరణ్. ఇక సౌత్ నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ప్రతీ పాన్ ఇండియా సినిమాను కరణ్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా పూరీ డైరెక్షన్ లో.. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాను నిర్మిస్తున్నారు కరణ్ జోహార్.