విక్రమ్ - హరి కాంబినేషన్ లో వచ్చిన సామి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. క్రికెట్ మ్యాచ్ వినాయకచవితి ఉత్సవాల కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గినా సోమవారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో సందడి మొదలైందని అన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సామి. ప్రముఖ దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి సినిమా కలెక్షన్స్ పై ఆనందం వ్యక్తం చేశారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా మంచి సక్సెస్ ను అందుకుందని మీడియా సమావేశంలో తెలిపారు.
విక్రమ్ - హరి కాంబినేషన్ లో వచ్చిన సామి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. క్రికెట్ మ్యాచ్ వినాయకచవితి ఉత్సవాల కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గినా సోమవారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో సందడి మొదలైందని అన్నారు. అనూహ్యంగా కలెక్షన్స్ పెరుగుతుండడంతో సంతోషంగా ఉన్నామని మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నిర్మాత వివరించారు.
ఇక సామి సినిమాలో ఐశ్వర్య రాజేష్ - బాబీ సింహ మరియు సూరి కూడా ప్రధానపాత్రల్లో కనిపించారు. సినిమాలో సూరి కామెడీ హైలెట్ గా నిలిచిందని టాక్ వస్తోంది. ఇక సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
