టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన వ్యక్తి మూడోసారి డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇలానే రెండు సార్లు పట్టుబడినా.. తెలివిగా తన డ్రైవర్ ని కేసులో ఇరికించి ఆయన తప్పించుకున్నాడు. 

కానీ ఈసారి ఆయన ఆటలు సాగలేదు. వివరాల్లోకి వెళితే.. ఓ స్టార్ హీరో పుట్టినరోజు వేడుకల్లో ఫుల్లుగా మద్యం సేవించి తన కారులో ఇంటికి బయలుదేరాడు ఓ నిర్మాత. అదే సమయంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఈ ప్రొడ్యూసర్ అడ్డంగా దొరికిపోయారు. 

అయితే కోర్టులో తన బదులు తన డ్రైవర్ ని నిందితుడిగా నిలబెట్టాడు. విషయం గ్రహించి న్యాయమూర్తి డ్రైవర్ కి వార్నింగ్ ఇవ్వడంతో నిర్మాత కోర్టుకి హాజరుకాక తప్పలేదు. ఈసారి చలానా తప్పించుకున్నప్పటికీ ఆయన ఇమేజ్ కి కొంత డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి.

ఇంతకీ ఈ నిర్మాత పార్టీకి డ్రైవర్ ని ఎందుకు వెంటబెట్టుకొని వెళ్లలేదంటే ఆయనకి కొన్ని సీక్రెట్ వ్యవహారాలు ఉన్నాయట. ఆ విషయాలు డ్రైవర్ కి తెలియకుండా ఉండాలనే తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినట్లు సమాచారం.