హీరోలు పాటలు పాడటం విన్నాము. రామ్ గోపాల్ వర్మ వల్ల డైరక్టర్స్ కూడా పాడతారని తెలిసింది. ఇప్పుడు దిల్ రాజు కూడా మైక్ పట్టుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ లో మంచి గాయకుడు కూడా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ లో మంచి గాయకుడు కూడా ఉన్నారని ప్రపంచానికి తెలిసింది. అలాగని అయన బాత్రూం సింగర్ కాదు. స్టేజి మీద కూడా పర్ఫర్మ్ చేసేంత సింగింగ్ టాలెంట్ ఉందిని తేలిపోయింది.

రీసెంట్ గా కరీంనగర్ లో 'అమిగోస్ డ్రైవ్ ఇన్' రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. గెస్ట్ గా వెళ్లిన ఆయన్ని అక్కడ మ్యూజికల్ పెరఫార్మన్స్ ఇస్తున్న బ్యాండ్… దిల్ రాజ్ ని స్టేజి పైకి ఆహ్వానించింది. తమతో కలిసి పాడాల్సిందిగా కోరారు ఆ బ్యాండ్ సింగర్స్. మొహమాటంగానే మైక్ అందుకున్న దిల్ రాజ్ పాట మొదలెట్టారు. మొదట్లో బెరుకుగా పాడిన ఆయన ఆ తర్వాత లీనమయ్యి ఎంజాయ్ చేస్తూ అదరకొట్టారు.

Scroll to load tweet…

ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో ఆయన కూడా గొంతు కలిపారు. నాగార్జున నటించిన 'నిర్ణయం' సినిమాలోని 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్...' అంటూ ఎంతో ఉల్లాసంగా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. చూస్తేంటే ఆయనతో ఎవరో ఒకరు సినిమాలో కూడా పాడిస్తారేమో అని అంటున్నారు. మీరూ ఆ పాటపై ఓ లుక్కేయండి.

ఇక గ‌తంలో నైజాం ఏరియా (Naizam rights)లో కొంత మంది డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి పోటీ ఎదుర్కొన్న దిల్ రాజుకు ఈ సారి మాత్రం సినిమాలు క్యూ క‌ట్టాయ‌ట‌. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్ చిత్రాలైన ఆర్ఆర్ఆర్ (RRR), భీమ్లా నాయ‌క్ (Bheemla Nayak), రాధేశ్యామ్ (Radhe Shyam )చిత్రాలు దిల్ రాజు ఖాతాలో ఉన్నాయి.