నిర్మాత దిల్ రాజు నంబర్ వన్ ప్రొడ్యూసర్ హోదా నిలబెట్టుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ డిటైల్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది.
సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి సీనియర్స్ నెమ్మదించాక దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఈ మధ్య ఆయనకు నాగ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ నుండి పోటీ ఎదురవుతుంది. ఈ రెండు నిర్మాణ సంస్థలు దిల్ రాజుకు ధీటుగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి. విజయాలు అందుకుంటున్నాయి. అయితే దిల్ రాజు అంతకు మించి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దిల్ రాజు స్వయంగా మూడు బడా ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఎన్టీఆర్, ప్రభాస్ లతో చిత్రాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, ప్రభాస్ లతో మీకు గ్యాప్ వచ్చిందని అడగ్గా... ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తున్నాను. దాదాపు ఇది ఫైనల్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ తో ఒక మూవీకి ఒప్పందం చేసుకున్నాను. ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో మరొక చిత్రం చేయబోతున్నాను... అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. కాగా ఎన్టీఆర్ చిత్ర డైరెక్టర్ ఎవరనేది ఆయన ప్రకటించలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి 'జటాయు' టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలని ఎప్పటి నుండో చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ నటించే అవకాశం కలదంటున్నారు.
లేని పక్షంలో శైలేష్ కొలను వద్ద విశ్వంభర టైటిల్ తో మరో పాన్ ఇండియా సబ్జెక్టు ఉంది. జటాయు, విశ్వంభర ప్రాజెక్ట్స్ లో ఒకటి ఎన్టీఆర్ చేసే ఆస్కారం కలదట. ఈ మేరకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు నిర్మించే చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి అంటున్నారు. వీటితో పాటు రజినీకాంత్-బాబీ కాంబినేషన్లో ఒక మూవీ నిర్మించనున్నారట.
ఈ నాలుగు ప్రాజెక్ట్స్ ఫైనల్ అయితే దిల్ రాజు దాదాపు రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. ఎన్టీఆర్, ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. యావరేజ్ బడ్జెట్ రూ. 300 కోట్లు ఉంటుంది. పవన్ మూవీ కూడా ఓ రెండు వందల కోట్లకు తక్కువ ఉండదు. కాబట్టి దిల్ రాజు బ్యానర్లో భవిష్యత్తులో మనం ఊహించని చిత్రాలు విడుదల కానున్నాయి.
ఆల్రెడీ రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ భారీ ప్రాజెక్ట్. దర్శకుడు శంకర్ చాలా ఉన్నతంగా తెరకెక్కిస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్ కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్. పొలిటికల్ థ్రిల్లర్ కాగా రామ్ చరణ్ రెండు భిన్నమైన రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
