Family Star : దేవరతో ముడిపెడుతూ.. ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ డేట్ పై దిల్ రాజ్ క్లారిటీ.!
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడుంటుందనే దానిపై తాజాగా దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చివరిగా ‘ఖుషి’ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. దీంతో విజయ్ తదుపరి చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ Family Starతో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. తొలుత సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఆ మేరకు అధికారికంగా జనవరి 12 అంటూ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
కానీ, ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చి చేరడంతో మిగితా సినిమాలలాగే ‘ఫ్యామిలీ స్టార్’ కూడా వాయిదా పడింది. కానీ పక్కా డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయలేదు. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ Dil Raju నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్రాండ్ గానే రిలీజ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల రద్దీ పెరగడంతో రిలీజ్ డేట్ ను లాక్ చేయడం ఇబ్బందిగా మారింది. ఇక తాజాగా ఎప్పుడూ ఈ సినిమా రాబోతుందనే దానిపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
దిల్ రాజ్ తాజాగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ డేట్ విషయంపై స్పందించారు. ఈ సినిమాను విడుదలను ఎన్టీఆర్ ‘దేవర’ Devara Movie రిలీజ్ తో ముడిపెడుతూ రిలీజ్ పై మాట్లాడారు. దేవర చిత్రం ఒకవేళ పోస్ట్ పోన్ అయితే... ఫ్యామిలీ స్టార్ ఆ డేట్ కే (ఏప్రిల్ 05) రాబోతుందని చెప్పారు. దేవర వస్తే మాత్రం మరోడేట్ కు వెళ్తామన్నారు. మరోవైపు ‘దేవర పార్ట్ 1’ కూడా పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతోంది. పైగా దిల్ రాజు నోట దేవర వాయిదా అంటూ రావడంపై ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ లోనే ‘ఫ్యామిలీ స్టార్’ వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ చితాన్ని శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. పరుశురామ్ పెట్ల మరోసారి విజయ్ ను డైరెక్ట్ చేస్తున్నారు. క్రేజీ హీరోయిన్ మ్రుణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దివ్యాంన్ష కౌషిక్ మరో హీరోయిన్ గా అలరించబోతోంది. అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.