తెలుగులో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన హారికా హాసిని క్రియేషన్స్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. త్రివిక్రమ్ స్నేహితుడు చినబాబు ఈ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తుంటారు. త్రివిక్రమ్ సినిమాలు దాదాపు ఈబ్యానర్ లోనే నిర్మిస్తుంటారు. పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా కూడా ఈ బ్యానర్ లోనే నిర్మించారు. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ నష్టాలని చవిచూసింది.

నిర్మాతలు ఈ సినిమాతో బాగా నష్టపోయాయారు. తాజాగా ఈ సినిమా ఆఫీస్ ను మార్చేశారు. ఆఫీస్ వాస్తు సరిగ్గా లేదని, అజ్ఞాతవాసి కూడా ఆ కారణంగానే ఫ్లాప్ అయిందని నమ్మిన నిర్మాతలు ఆఫీస్ మార్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆఫీస్ మార్చడానికి కారణం వాస్తు కాదని, ప్లేస్ అని చినబాబు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫీస్ బంజారాహిల్స్ లోని గ్రీన్ వ్యాలీలో ఉంది.

హారిక హాసిని నిర్మించే సినిమాలతో పాటు  దీని అనుబంధు సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా పలు చిత్రాలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో అందరికీ ప్రస్తుతం ప్లేస్ సరిపోవడం లేదని, ఆ కారణంగానే సువిశాలమైన బంగ్లాని బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.