ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనిటీ లేదు అని సంచల ట్వీట్లు చేస్తూ వస్తున్న నిర్మాత బన్నీ వాసు, మరోసారి మరో ట్వీట్ లో ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించాడు. ఈసారి ఆయన ఏ విషయంలో ఫైర్ అయ్యాడంటే.
అల్లు టీమ్ లో నిర్మాతగా ఎదిగిన బన్నీ వాసు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాడు. ఇండస్ట్రీలో వివాదాలు, సమస్యలపై తనదైన స్టైల్ లో ట్వీట్ లు చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నాడు. రీ సెంట్ గా థియేటర్ ల బంద్ వార్తలు, పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో టాలీవుడ్ లో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. దాంతో అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వారు ప్రెస్ మీట్ లు పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈక్రమంలో పవన్ స్టాన్ పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తూ.. నిర్మాత బన్నీ వాసు ట్వీట్ లు చేయడం సంచలనంగా మారింది. నిజానికి అల్లు అర్జున్ కి, పవన్ కు పడటంలేదు అనేది అందరికి తెలిసిన విషయమే. ఈక్రమంలో అల్లు కాంపౌండ్ నుంచి నిర్మాతగా ఎదిగిన బన్నీ వాసు పవన్ ను సపోర్ట్ చేస్తూ.. ఇండస్ట్రీలో యూనిటీ లేదు, పవన్ లాంటి వారిని మనం ఇరిటేట్ చేశాం అంటూ వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈక్రమంలో మరోసారి తనదైన స్టైల్ లో ట్వీట్ చేశారు నిర్మాత బన్నీ వాసు. ఈసారి ఆయన ఏమన్నారంటే?
బన్నీ వాసు ఎక్స్ అకౌంట్ లో ఇలా రాసుకుంటూ వచ్చారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి.
మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది అని అన్నారు. స్టార్ హీరోలు సినిమాలు పంచాలని చెప్పిన బన్నీ వాసు.. ఓటీటీలకు సినిమాలు లేట్ గా ఇస్తే.. థియేటర్లు బ్రతుకుతాయి అని అన్నారు.
ఇక గతంలో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో, ఇండస్ట్రీలో రాజకీయాల గురించి ట్వీట్ చేశారు బన్నీ వాసు. అప్పుడు ఆయన ఏం రాశారంటే? సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అని ట్వీట్ చేశారు. దాంతో బన్నీ వాసు ట్వీట్లు, థియేటర్ల సమస్యలపై టాలీవుడ్ లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో చిరంజీవి రంగంలోకి దిగుతారా? లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకూ అయితే మెగాస్టార్ ఈ విషయంలో స్పందించలేదు.
