పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నిర్మాతను ఆదుకున్నారు. తన సినిమా వల్ల ఎవరు నష్టపోవద్దు అని కోరకునే పవన్ నిర్మాత కోసం తన రెమ్యునరేషన్ త్యాగం చేసినట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సబంధించిన ఈమధ్య రోజుకో రూమర్ బయటకు వస్తుంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ సుధీర్ఘకాలం సాగడంతో పాటు, ఆర్ధిక ఇబ్బందులు కూడా ఫేస్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో.. లైన్ లోకి జోత్యి కృష్ణ వచ్చాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో హరిహర వీరమల్లు” కూడా ఒకటి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పరిస్థితి ఏంటో అభిమానులకి అంతుపట్టడం లేదు. ఎప్పుడు షూటింగ్ అంటారో తెలియదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. ఈక్రమంలోనే ఆమధ్య హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ను ప్రకటించారు టీమ్. కాని ఇలా ప్రకటించారో లేదో.. అలా మరోసారి రిలీజ్ డేట్ మారినట్టు సమాచారం.
అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒకోసారి ఒకో ట్విస్ట్ తగులుతోంది. ఎప్పుడు ఏ ప్రకటన వస్తుందో తెలియకుండాపోయింది. హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ అయిపోయింద, పవన్ ఒక్క నైట్ లో డబ్బింగ్ కూడా చెప్పేశాడు. కాని ఇంకా పని ముందుకు సాగడంలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యనే మొదలయ్యాయి. కానీ ఇంతలోనే మళ్ళీ ఈసినిమా రిలీజ్ వాయిదా పడ్డట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈసినిమా నిర్మాత ఏ ఎం రత్నం హరిహర వీరమల్లు కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గానే ప్రమోషన్స్ ని కూడా తానే ముందుండి నడిపించారు. అయితే సడెన్ గా ఈ నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు అనే షాకింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకున్న పవన్ తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం 11 కోట్లు మళ్ళీ వెనక్కి ఇచ్చాడని తెలుస్తోంది.
అలాగే సినిమా రిలీజ్ ని ఎలాంటి ప్రెజర్ లేకుండా ముందు రిలీజ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈనెలలో(జూన్) రిలీజ్ అవ్వవలసిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.
