చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి బండ్ల గణేష్.. ఎవరికీ కనిపించకుండా మాస్క్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 11:43 AM IST
producer bandla ganesh attended the court
Highlights

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి ఆ తరువాత నిర్మాత స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు గాంచాడు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి ఆ తరువాత నిర్మాత స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు గాంచాడు. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటోన్న బండ్ల గణేష్ పై ఇప్పటికే పలు చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి.

దాదాపు 68 చెక్ బౌన్స్ కేసులు అతడిపై ఉన్నాయని సమాచారం. మూడు కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగా మిగిలిన కేసులపై విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసుకి సంబంధించి ప్రొద్దుటూరు జిల్లా రెండో అదనపు కోర్టుకి శుక్రవారం బండ్ల గణేష్ హాజరయ్యారు. ఆయన ఉదయం ప్రొద్దుటూరుకి వచ్చి తన కారుని జార్జి క్లబ్ లో ఉంచి అక్కడ నుండి కోర్టుకి వెళ్లారు. కంప్లైంట్ చేసిన వారి సమక్షంలోనే న్యాయమూర్తి బండ్ల గణేష్ ని విచారించారు.

దీనికి ఆయన కొంతకాలం సమయం కావాలని కోర్టుని కోరినట్లు తెలుస్తోంది. విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మీడియా బండ్ల గణేష్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించారు. ఎవరికీ కనిపించకుండా మాస్క్ ధరించి కోర్టు  నుండి బయటకి వెళ్లిపోయారు. 

loader