మహేష్ బాబు కెరీర్ లో 'ఆగడు' సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా చేయడం మిస్టేక్ అంటూ మహేష్ బాబు స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఇలాంటి సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత అనీల్ సుంకర పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషం.

ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను దిల్ రాజుతో కలిసి అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఆగడు'తరహాలో మంచి హైప్ రావాలని అనీల్ సుంకర కోరుకుంటున్నారు. 

‘ఆగడు’కు బ్యాడ్ రివ్యూలు వచ్చినప్పటికీ. ఓవర్సీస్ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని.. ప్రిమియర్లతోనే 5 లక్షల డాలర్ల మార్కును అందుకున్న తొలి తెలుగు సినిమా అదేనని అనీల్ సుంకర చెప్పారు. ‘సరిలేరు నీకెవ్వరు’కు ‘ఆగడు’ స్థాయి హైప్, ‘దూకుడు’ తరహా కంటెంట్ ఉండాలని తాను కోరుకుంటున్నాను.. మీరేమంటారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ అభిమానుల్ని ప్రశ్నించాడు అనీల్. 

‘ఆగడు’ విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అనీల్ ఈ ట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ దశలో ఉంది. హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.