తెలుగువారి పెద్ద పండగలు దశరా, దీపావళి, సంక్రాంతి. ఈ మూడు పండుగలకు తమ సినిమాలు రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు,హీరోలు ప్లాన్ చేస్తూంటారు. అందుకోసం వెయిట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం రాబోయే మూడు పెద్ద పండుగలకు స్లాట్స్ బుక్ చేసేసుకున్నారు ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర.

మొదటగా వచ్చే దశరా పండుగకు గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ చాణుక్యను రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత దీపావళి పండగకు అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రం బంగారు  బుల్లోడుని రెడీ చేస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా దీపావళికి హిట్ అవుతుందని భావిస్తున్నారు. 

ఇక అసలైన పెద్ద పండగ సంక్రాంతి కు అతి పెద్ద స్టార్,సూపర్ స్టార్ మహేష్ బాబు తో నిర్మిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా మూడు పండగలకు మూడు సినిమాలు రిలీజ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అనీల్ సుంకర ఆ విషయంలో  చాలా గ్రేట్ అంటున్నారు మిగతా నిర్మాతలు.

అంతేకాదు అనీల్ సుంకర్ డీల్ చేస్తున్న సినిమాలుకూడా వేర్వేరు జానర్స్ కు సంభందించినవి. లావిష్ బడ్జెట్ లు. అల్లరి నరేష్  సినిమా మినహాయిస్తే మిగతా రెండు సినిమాలు చాణుక్య, సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు బడ్జెట్ లు ఎక్కువే. ఏదైమైనా ఈ మూడు హిట్టైతే తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా అనీల్ సుంకర అనిపించుకుంటారు.