టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోనేరు అనీల్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

తెలుగులో 'రాధా గోపాలం', 'అల్లరి బుల్లోడు' వంటి సినిమాలను నిర్మించారు అనీల్ కుమార్. ఆయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.