Asianet News TeluguAsianet News Telugu

టీకా వేసుకోవడం వల్లే సేఫ్‌గా ఉన్నా..కానీ అది అవాస్తవం..కరోనా పాజిటివ్‌పై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ‌

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చారు. తనకు కరోనా సోకిన విషయం వెల్లడిస్తూ, టీకా పనితీరుని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియోని పంచుకున్నారు మెగా ప్రొడ్యూసర్‌. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ తర్వాత ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. 

producer allu arvind clarity on corona and corona vaccine arj
Author
Hyderabad, First Published Apr 5, 2021, 4:16 PM IST

తన అల్లు అరవింద్‌ కరోనా సోకిందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ క్లారిటీ ఇచ్చారు. తనకు కరోనా సోకిన విషయం వెల్లడిస్తూ, టీకా పనితీరుని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియోని పంచుకున్నారు మెగా ప్రొడ్యూసర్‌. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ తర్వాత ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. 

ఇంకా ఆయన చెబుతూ, `కరోనా వ్యాక్సినేషన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత తన స్నేహితులతో కలిసి ఓ ఊరు వెళ్లామని, మా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే మా ముగ్గురిలో ఇద్దరం చాలా సేఫ్‌గా ఉన్నాం. ఒకరు మాత్రం హాస్పిటల్‌లో జాయన్‌ అయ్యారు. ఎందుకంటే మేమిద్దరం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నాం.. ఈ వైరస్‌ ప్రభావం ఏవిధంగానూ మాపై ప్రభావం చూపలేదు. నా స్నేహితుడు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. 

కనుక వ్యాక్సిన్‌ వేయించుకుంటే కరోనా వస్తుందనేది అపోహ. అలా వచ్చినా ఎలాంటి ప్రభావం చూపకుండా మనం సేఫ్‌గా ఉంటామని చెప్పడానికి నేనే ఉదాహరణ. అందరు కచ్చితంగా వ్యాక్సినేషన్‌ చేయించుకోండి` అని చెప్పారు అరవింద్‌. అయితే తనకు రెండు కరోనా డోసులు తీసుకున్నాక కరోనా వచ్చిందనేది అవాస్తవమన్నారు. ఇప్పటికే వైద్య నిపుణులు కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న వారికి యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉంటాయని.. అందువల్ల కరోనా వైరస్ సోకినా దాని ప్రభావం తక్కువగా ఉంటుందని అరవింద్‌ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios