సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే చాలా మంది నటీమణులు బహిరంగంగా కామెంట్స్ చేశారు. బాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అవ్వకపోతే అవకాశాలు రానివ్వకుండా చేస్తారని కొందరు తారలు చెబుతున్నారు.

రీసెంట్ గా ఇదే విషయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ప్రియాంక ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనల గురించి వివరించింది.

ఆమె మాట్లాడుతూ..'ఒక నిర్మాత కథ చెబుతానని నా కూతురిని మాత్రమేలోనికి పిలిచాడు. కథ చెప్పడానికి తనని మాత్రమే ఎందుకు పిలిచాడు. నన్ను కూడా పిలవొచ్చు కదా అనుకున్నాను. వేరొక నిర్మాత కూడా అలానే ప్రవర్తించాడు. కేవలం గదిలోకి రానన్నందుకు ప్రియాంక చోప్రా పది, పదిహేను అవకాశాలు కోల్పోయింది. గదిలోకి పిలిచి 
అసభ్యంగా ప్రవర్తించి వారికి సహకరించలేదని అవకాశాలు ఇవ్వలేదంటూ'' మధుచోప్రా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో ప్రియాంక చోప్రా కూడా ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించింది. కానీ ఆ నిర్మాతలు ఎవరనే విషయాన్ని మాత్రం ఈ బ్యూటీ బయటపెట్టలేదు. రీసెంట్ గా హాలీవుడ్ సింగర్ నిక్ జొనాస్ ని వివాహం చేసుకున్న ప్రియాంక అమెరికాలోనే సెటిల్ అవ్వాలని అనుకుంటోంది.