Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక చోప్రాకు కొత్త కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

  • ప్రియాంక చోప్రాకు కొత్త కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
  • బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక
  • అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు ప్రియాంకను వరించిన అవార్డు
priyanka chopra to get dada saheb phalke award again

బేవాచ్‌ మూవీతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ఆమెను వరించింది. ఈ మూవీలో ఆమె పోషించిన విక్టోరియా లీడ్స్‌ విలన్‌ పాత్రకు హాలీవుడ్‌లో ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్‌ దగ్గర బేవాచ్‌ బోల్తా కొట్టినా, ప్రియాంకాకు మాత్రం మంచి పేరే వచ్చింది. వాస్తవానికి ఆమె కోసమే ప్రత్యేకంగా ఓ కొత్త కేటగిరీ పెట్టి ఫాల్కే అవార్డును ఇస్తుండటం విశేషం. ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్‌డ్‌ యాక్ట్రెస్‌ పేరుతో ఓ కొత్త కేటగిరిని అవార్డును కమిటీ ప్రవేశ పెట్టింది. ఈ విషయాన్ని కమిటీ చైర్మన్‌ అశోక్‌ శేఖర్‌ ధృవీకరించారు.

 

నిజమే అవార్డుల జాబితాలో ఈ కొత్త కేటగిరీని ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. అంతేకాదు ఈ అవార్డుకు ప్రియాంకాను మించిన మరోక నటి లేరు. అవార్డు స్వీకరించడానికి ఆమె కూడా అంగీకరించింది అని అశోక్‌ శేఖర్‌ తెలిపారు. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ప్రియాంకాకే దక్కుతుందని ఆయన అన్నారు. అందుకే ఓ కొత్త కేటగిరీని తీసుకురావాలని కమిటీ నిర్ణయించినట్లు శేఖర్‌ చెప్పారు. ప్రియాంకాతోపాటు అమె తల్లి మధు చోప్రా కూడా బెస్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు అందుకోనుండటం విశేషం. మధు చోప్రా నిర్మించిన మరాఠీ సినిమా వెంటిలేటర్‌ ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios