ప్రియాంక చోప్రా ఫీజెంతో తెలుసా?

First Published 16, Dec 2017, 4:21 PM IST
Priyanka Chopra To Be Paid Rs 4 to 5 Crore For 5 Minute Dance Performance for Zee Cine Awards
Highlights

ఆమెకు ఉన్న డిమాండ్ ను బట్టి అడిగినంత ఇస్తే ఆమె ప్రోగ్రామ్స్ కు ఒప్పుకోవడం లేదు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు అద్భుతమయిన డీల్ కుదిరింది. ఈమధ్య ఆమె హాలీవుడ్‌ స్టార్ అయిపోయి బాగా బిజి అయ్యారు.  ఒక రెండేళ్లుగా ఆమె ఇండియాలో ఏ వేదిక మీద కనిపించలేదు. అదే అమె అంటే జాతీయంగా అంతర్జాతీయంగా ఎన లేని క్రేజ్ ఉంది.  అందుకే  దేశంలో అత్యధిక పారితోషకం పొందుతున్న నటీమణుల్లో ఒకరయ్యారు.  ఇదిసరే, ఇలాంటి ప్రియాంక చోప్రా ఈ నెల 19 ముంబాయిలోని ఒక  గ్రాండ్ గలా పంక్షన్ పర్ ఫామ్ చేయబోతున్నారు. ప్రోగ్రాం ఏమిటంటే జీ సినీ అవార్డుల  ప్రోగ్రాం. దీనికి దాదాపు నిమిషానికి కోటిరుపాయలు ఆమె చార్జ్ చేస్తున్నారట. అమె నాలుగుయిదు నిమిషాలు స్టేజ్ మీద ఉండేదుకు అయిదు కోట్లు అందిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ముంబాయికి చెందిన మిడ్డే పత్రిక పేర్కొంది.

‘‘ ప్రియాంకు ఉన్నడిమాండ్ వల్ల ఆమె కోట్ చేసిన మొత్తం మీద బేరసారాలకు దిగలేదు. నిమిషానికి కోటిరుపాయలైనా నిర్వాహకులు ఒప్పేసుకున్నారు,’ అని  ఆంతరింగికుడొకరు వెల్లడించారు.


ఈ మధ్య కాలంలో ఆమె పెద్దగా బయటకనిపించేలేదు. ఒక ఏడాది అంటే 2016లో కిందట ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డ్స్ పంక్షన్ లో పాల్గొన్నారు.చాలా కాలం తర్వాత ఆమె స్టేజ్ కనబడుతున్నందున స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. డిసెంబర్ 19 న ఆమె తన సూపర్ హిట్ సాంగ్స్ డ్యాన్స్ చేస్తుంది. ఈ మధ్యలో ఐఐఎఫ్ ఎ 2016 లో ఆమెకు చాన్స్ వచ్చింది. అయితేవాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక పోయారు. ఫలితంగా ఆమె ప్రోగ్రాం నుంచి తప్పుకున్నారు.

loader