ప్రియాంక చోప్రా మరోమారు నెటిజన్లకు అడ్డంగా బుక్కైంది. ఫ్యామిలీతో కలసి ధూమపానం చేస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందరికి నీతులు చెప్పే ప్రియాంక చోప్రా ఏం చేస్తుందో చూడండి అంటూ అభిమానులు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

ఈ ఫొటోలో ప్రియాంక సిగరెట్ తాగుతుండగా ఆమె భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా కూడా ధూమపానం చేస్తున్నారు. గతంలో ప్రియాంక చోప్రా చెప్పిన నీతి సూక్తులని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. దీపావళికి పటాసులు కాల్చవద్దు.. దీపాలతో జరుపుకుని పర్యావరణాన్ని కాపాడండి అని ప్రియాంక గతంలో సందేశం ఇచ్చింది. 

ఇప్పుడు ప్రియాంక సిగరెట్ తాగుతూ చేస్తున్నది ఏమిటి అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తం స్మోకింగ్ బ్యాచ్ అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. 

గతంలో ఆస్తమా రోగులకు కూడా ప్రియాంక సందేశం ఇచ్చింది. ఆస్తమా రోగులు ప్రియాంక మాటలు వినొద్దని, ఆమె సిగరెట్ తాగుతున్న ఫోటో చూడొద్దని అంటున్నారు. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ స్టేటస్ అందుకున్న ప్రియాంక హాలీవుడ్ లో కూడా పాపులర్ అయింది. ఈ సిగరెట్ వివాదానికి ప్రియాంక ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.