Asianet News TeluguAsianet News Telugu

గ్లోబల్ ఫెస్టివల్‌లో భర్తను ముద్దులతో ముంచెత్తిన ప్రియాంక చోప్రా.. వైరల్ అవుతున్న వీడియో!

మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తాజాగా ఆమె భర్త నిక్ జోనాస్ (Nick Jonas)ను ముద్దులతో ముంచెత్తింది. గ్లోబల్ ఫెస్టివల్ లో లిప్ లాక్ చేసి అభిమానులను షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 

Priyanka Chopra showered her husband with kisses at the Global Festival, The video is going viral!
Author
First Published Sep 26, 2022, 3:15 PM IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనాస్ గతంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎప్పుడూ రొమాంటిక్ గా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా దర్శనమిస్తూనే ఉంటారు. ప్రత్యేక రోజుల్లో మరింత రొమాంటిక్ గా కనువిందు చేయడం స్టార్ కపుల్ ప్రత్యకత. తాజాగా మరోసారి వీరిద్దరూ వార్తలో నిలిచారు. ఈ శనివారం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌ (Global Citizen Festival)ను గ్రాండ్ గా నిర్వహించారు. గ్లోబల్ ఫెస్టివల్ స్టేజ్ పై నిక్ జోనస్ అద్భుతమైన ప్రదర్శను కనబరిచారు. ఆయన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 

అయితే ఈ వేదికపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్, నిక్ జోనాస్ వైఫ్ ప్రియాంక  చోప్రా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. గ్లోబల్ వేదికపై నిక్ జోనస్ ప్రదర్శన పూర్తవ్వగానే ప్రియాంకను వేదికపైకి పిలిచాడు. పరిచయ కార్యక్రమాలనంతరం ఎమోషనల్ అయిన ప్రియాంక చోప్రా భర్త నిక్ ను ముద్దులతో ముంచెత్తింది. అంతటితో ఆగకుండా లిప్ లాక్ చేసింది. దీంతో ఆడియెన్స్, అభిమానులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి.  

స్టార్ కపుల్ గ్లోబల్ వేదికపై రొమాంటిక్ గా కనువిందు చేయడంతో అభిమానులు, ప్రేక్షకులు ఖుషీ అయ్యారు. నిక్, ప్రియాంకను ఎంకరేజ్ చూస్తే, ఒకరిపై మరొకరు చూపుతున్న ప్రేమకు ఫిదా అయ్యారు. ఇక కేరీర్ పరంగా హిందీ చిత్రాల్లో కాస్తా జోరు తగ్గించిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఫిల్మ్స్ లోనే నటిస్తూ బిజీగా ఉంది. గతేడాది ‘ది వైట్ టైగర్’,‘ది మ్యాట్రిక్స్ రిసరక్షన్స్’ చిత్రాల ద్వారా నటించింది. ప్రస్తుతం ‘ఇట్స్ ఆల్ కామింగ్ బ్యాక్ టు మి’ ద్వారా అలరించబోతోంది. ఇటు కేరీర్ ను, అటు ఫ్యామిలీ లైఫ్ ను ప్రియాంక పార్లల్ గా కొనసాగిస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios