గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా కొంతకాలం పాటు ఇషితా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఏప్రిల్ లో వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే కొన్ని రోజులకు ఇషిత నిశ్చితార్దానికి సంబంధించిన ఫొటోలన్నీ సోషల్ మీడియాలో తొలగించారు. దీంతో పెళ్లి రద్దయినట్లు వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత తామిద్దరం పెళ్లికి సిద్ధంగా లేమని మీడియా ముందు బయటపెట్టింది ఈ జంట. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తమిళ నటి నీలమ్ ఉపాధ్యాయతో ఆయన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ వేడుకకు సిద్ధార్థ్ నీలమ్‌తో కలిసి రావడం, ఫంక్షన్ లో ఉన్నంతసేపు  నీలమ్ ని వదలకుండా ఆమెతోనే ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు మొదలయ్యాయి. తెలుగులో 2012లో వచ్చిన 'మిస్టర్7'  సినిమాలో నీలమ్ నటించింది.

ఆ తరువాత తమిళంలో కూడా నటించింది. మరి నీలమ్ తో సిద్ధార్థ్ తన రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లి వివాహం చేసుకొని ఒక్కటవుతారో లేదో చూడాలి!