సినీ నటులుగా ఒక్కసారి క్లిక్ అవ్వాలే గాని అడుగేస్తే ఆదాయం అన్నట్లుగా ఉంది కొందరి తారల లైఫ్. పర్సనల్ లైఫ్ ను కూడా బిజినెస్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఊరికే ఆదాయాన్ని వదులుకోవాలి అనుకున్నారో ఏమో గాని ప్రియాంక - నిక్ జోడి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. 

వారి పెళ్లి సెట్ అయినప్పటి నుంచి తరచు ఎదో ఒక న్యూస్ మీడియాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా వారికి సంబందించిన ఫొటోలు కూడా ట్రేండింగ్ గా మారుతున్నాయి. ఆ వీడియోలు ఫొటోల వల్ల మీడియా చాలా లాభాలు పొందుతుంది అనుకున్నట్లు ఉన్నారు అందుకే పెళ్లి పోటోలను బేరం పెట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. . 

ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు 25లక్షల డాలర్లకు వారి పెళ్లి ఫొటోల హక్కులను రాసిచ్చినట్లు తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 18 కోట్ల రూపాయలు. ఈ లెక్కన చుస్తే ప్రియాంక రెండు సినిమాల రెమ్యునరేషన్ ను గట్టిగా అందుకున్నట్లు ఉందని, తన పెళ్లి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే ఆదాయాన్ని పెంచుకోవడం బ్రిలియంట్ ఐడియా అంటున్నారు నెటిజన్స్.  వచ్చే నెల 2న జోధ్‌పూర్‌లో ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ వివాహం జరగనుంది.