లగ్జరీ డైమండ్ జ్యువెల్లర్ నీరవ్ మోడీ చేస్తున్న వ్యాపారాలకు ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నీరవ్ మోడీకి ప్రియాంక చోప్రా తాజాగా లీగల్ నోటీసులు పంపింది. యాడ్స్ చేసినందుకు తనకు రావాల్సిన డబ్బు ఇంకా చెల్లించక పోవడంతో ప్రియాంక చోప్రా ఈ నోటీసులు జారీ చేశారు.

 

నీరవ్ మోడీ ఇండియాలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి. ప్రియాంక చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, లీసా హెడెన్ లాంటి వారితో తమ ఆభరణాలకు ప్రచారం చేయించారు. హాలీవుడ్ స్టార్స్ కేట్ విన్స్‌లెట్, డకోటా జాన్సన్‌తో కూడా ఇతగాడి బ్రాండ్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. భారీ మోసం వెలుగులోకి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోడీ వేలకోట్ల రూపాయలు శఠోపం పెట్టాడు. అతడి మోసం వెలుగులోకి వచ్చేలోపే నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడు.

 

ఈ విషయం తెలిసి ప్రియాంక చోప్రా తన లాయర్ ద్వారా అతడికి లీగల్ నోటీసులు పంపారు. ప్రియాంక చోప్రాకు కొన్ని కోట్ల రూపాయలు నీరవ్ మోడీ నుండి రావాల్సి ఉందని తెలుస్తోంది. ప్రియాంకతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కూడా నీరవ్ మోడీ తమ వ్యాపార ప్రచారానికి వాడుకుని డబ్బు ఎగ్గొట్టినట్లు సమాచారం.