బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు మార్గాన్ని ఏర్పరచుకొని మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా. కాలం కలిసి రావాలే గాని ప్రతి క్షణం సంతోషంగా ఉండవచ్చు. పేదోడి ఇంట పెళ్లంటే నవ్వులే పెద్ద ఆస్తులు. అర్ధం చేసుకునే ఇల్లాలు ఉంటె అంతకంటే మరో సంతోషం ఉండదు. ఇక డబ్బున్న భర్త దొరకలే గాని రోజుకో గిఫ్ట్ అందుతుంది. 

ఇప్పుడు నటి ప్రియాంక చోప్రాకు అన్ని కలిసొస్తున్నాయి. నిజమైన ప్రేమ దొరికిందని చాలా సార్లు చెప్పిన అమ్మడు తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ముంబైలో నిశ్చితార్ధాన్ని కూడా గ్రాండ్ గా నిర్వహించగా నిక్ కోటి 8 లక్షల విలువగల రింగ్ ను కానుకగా ఇచ్చాడు. 

ఇక నిన్న న్యూ యార్క్ లో జరిగిన బ్రైడల్ షోవర్ వేడుకలో అయితే నిక్ కానుక డోస్ స్ట్రాంగ్ గా పెంచేశాడు. 6.50కోట్ల విలువగల టిఫానీ అండ్ కోకి సంబందించిన వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చి ప్రేయసిని థ్రిల్ చేశాడట. 

దీంతో ప్రియాంక కంటి మీద కునుకు లేకుండా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక డిసెంబర్ 1న పెళ్లి నిర్వహించేందుకు ప్రియాంక కుటుంబ సభ్యులు జోధ్ పుర్ లో ఘనంగా ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.