గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సైతం తన కూతురుని పరిచయం చేసింది. చిన్నారి కూతురు మాల్తీ మేరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఓ ఫోటోని పంచుకుంది ప్రియాంక చోప్రా.
మదర్స్ డే(మే8)(Mothers Day) సందర్భంగా సెలబ్రిటీలంతా తమ మదర్స్ కి విషెస్ తెలిపారు. కాజల్ ఫస్ట్ టైమ్ తన కుమారుడు నీల్ ఫోటోని పంచుకుంది. ఆమెతోపాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) సైతం తన కూతురుని పరిచయం చేసింది. చిన్నారి కూతురు మాల్తీ మేరీ(Malti Marie)ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఓ ఫోటోని పంచుకుంది ప్రియాంక చోప్రా. అయితే ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. భర్త నిక్ జోనాస్(Nick Jonas)తోపాటు తన కూతురుని పట్టుకుని తన గుండెకి హత్తుకుని ఆ మాతృత్వపు అనుభూతులు పొందుతూ దిగిన ఫోటోని షేర్ చేసింది ప్రియాంక. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
ఇందులో ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్ చేశారు. `వంద రోజులకుపైగా ఎన్‌ఐసీయు(నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో గడిపిన తర్వాత ఎట్టకేలకు మా చిన్ని అమ్మాయి ఇంటికొచ్చింది` అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది ప్రియాంక. `ప్రతి కుటుంబం ప్రయాణం ప్రత్యేకమైనది, దానికి ఒక నిర్ధిష్టమైన విశ్వాసం అసవరం. మాది కొన్ని నెలలు సవాలుగా సాగినప్పటికీ, పునరాలోచనలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంత విలువైనది. ప్రతి క్షణం పరిపూర్ణంగా ఉంటుంది` అని పేర్కొంది. కూతురు తమ జీవితంలోకి వచ్చాక కలిగే ఫీలింగ్స్ ని ఆమె పేర్కొంది.
ప్రియాంక ఇంకా చెబుతూ, `మా చిన్నారి ఎట్టకేలకు ఇంటికి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. రాడి చిల్డ్రన్స్ లా జోల్లా, లాస్ ఏంజిల్స్ లోని సెడార్ నినాయ్ ఆసుపత్రుల్లో నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్క డాక్టర్, నర్సు, స్పెషలిస్ట్ లకు నా ధన్యవాదాలు. మా నెక్ట్స్ ఛాప్టర్ ఇప్పుడే ప్రారంభమైంది. మా పాప బడాస్. మమ్మీ, డాడీ నిన్ను ప్రేమిస్తున్నారు` అని తెలిపింది ప్రియాంక చోప్రా.
ఇదిలా ఉంటే ప్రియాంక తమ జీవితంలోకి కూతురుని ఆహ్వానిస్తూ జనవరిలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా తాము కూతురిని జన్మనివ్వబోతున్నట్టు పేర్కొంది ప్రియాంక. అయితే అప్పటి నుంచి చిన్నారిని ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తుంది. ఫైనల్‌గా ఆసుపత్రి నుంచి ఇంటికి రావడంతో కూతురిని మదర్స్ డే సందర్భంగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నిక్, ప్రియాంక జంట. ప్రియాంక-నిక్ ప్రేమించుకుని 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. `ఇట్స్ ఆల్ కమ్మింగ్ బ్యాక్ టూ మీ` అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తుంది.
