ప్రియాంకకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు

First Published 12, Dec 2017, 3:51 PM IST
priyanka chopra gets mother theressa award
Highlights
  • బాలీవుడ్ నుండి గ్లోబల్ స్టార్ రేంజికెళ్లిన మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకచోప్రా
  • ప్రస్థుతం యునిసెఫ్ గుడ్ విల్ ఎంబాజిడర్ గా వ్యవహరిస్తున్న ప్రియాంక చోప్రా
  • తాజాగా సామాజిక సేవా కార్యక్రమాలతో మదర్ థెరిసా జ్ఞాపికను అందుకున్న ప్రియాంక

 

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ గా మారిన ప్రియాంక చోప్రా తాజాగా మరోసారి అరుదైన గుర్తింపు పొందింది. తాజాగా ప్రియాంక మదర్‌ థెరిసా జ్ఞాపికను అందుకున్నారు. సామాజిక సేవలు చేస్తున్నందుకు గానూ ప్రియాంకకు ఈ జ్ఞాపిక అందజేశారు. ఇప్పటికే ప్రియాంక యూనిసెఫ్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవి కాకుండా వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తున్నారు.

 

అయితే ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతో ఆమె తల్లిమధు చోప్రా ఈ జ్ఞాపికను అందుకున్నారు. ఈ విషయమై మధు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓ తల్లిగా ప్రియాంక లాంటి కుమార్తెను కన్నందుకు చాలా గర్వంగా ఉంది. మనం ఎంత సాయం చేస్తే మనకు అంత ఎక్కువ లభిస్తుంది అన్న దానికి ప్రియాంకనే నిలువెత్తు నిదర్శనం. ప్రియాంకకు చిన్నప్పటి నుంచి మదర్‌ థెరిసా అంటే ఇష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్‌ నివాస్‌ అనే వృద్ధాశ్రమానికి ప్రియాంక విరాళాలు కూడా ఇచ్చేది. ఇంత చేస్తున్న ప్రియాంక ఈ అవార్డుకు అర్హురాలే.’ అని తెలిపారు.

 

ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రముఖ అమెరికన్‌ టీవీ సీరీస్‌ ‘క్వాంటికో’లోనూ నటిస్తున్నారు. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రియాంక త్వరలో భారత్‌ రానున్నారు.

loader