ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఆదివారం నాడు ఈ షోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గెస్ట్ గా వచ్చారు. తను నటించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి హాజరైంది ప్రియాంక.

ఈ సందర్భంగా ప్రియాంక కపిల్‌ను ఓ ప్రశ్న అడిగారు. 'నీకు రెండు కోట్లు కావాలా..? ఆరుగురు అమ్మాయిలతో మాల్దీవ్స్ కి ట్రిప్ కావాలా..?' రెండిట్లో దేన్నీ ఎన్నుకుంటావ్ అని ప్రశ్నించారు. దానికి కపిల్ స్పందిస్తూ... 'నాకు రెండు కోట్లు కావాలి.. ఎందుకంటే అరవై వేలు పెడితే మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లి రావొచ్చు' అని సమాధానం చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియోను కపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెళ్లి తరువాత ప్రియాంకా బాలీవుడ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత ఆమెనటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు.

సోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కి సిద్ధమవుతోంది. చిన్నతనంలోనే అరుదైన వ్యాధికి గురైన అయిషా చౌదరి పదిహేనేళ్లకే వక్తగా, రచయిత్రిగా  గుర్తింపుతెచ్చుకుంది. ఆమె జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.