Asianet News TeluguAsianet News Telugu

'ది మాట్రిక్స్‌ 4’ లో ప్రియాంక,హిట్టైతే తిరుగేలేదింక

గ్లోబల్‌ స్టార్‌, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తూనే హాలీవుడ్‌లో నటించే చాన్స్‌ అందుకుంది.  ప్రస్తుతం అక్కడే హాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది. 

Priyanka Chopra bags key role in The Matrix 4
Author
Hyderabad, First Published Aug 28, 2021, 10:33 AM IST

సాధారణమైన నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక అతి తక్కువ సమయంలో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ హోదాకు ఎదిగారు. ఆ తర్వాత హాలీవుడ్ లో ప్రవేశించి గ్లోబుల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్-హాలీవుడ్‌ చిత్రాలు, సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ప్రియాంక ని హాలీవుడ్ స్టూడియోస్ తమ మేజర్ ప్రొడక్షన్స్ లో భాగం చేస్తోంది. ఆ క్రమంలోనే ‘మ్యాట్రిక్స్‌ 4’ చేస్తోంది. అందులో ఆమె కీలక పాత్రలో కనిపించబోతోంది. రీసెంట్ గా ఈ చిత్రం ట్రైలర్ ని ప్రదర్శిస్తే మంచి అప్లాజ్ వచ్చింది. 

‘మ్యాట్రిక్స్‌ 4’ షూటింగ్‌ రెగ్యులర్ షూటింగ్ లో ఆమె పాల్గొనబోతున్నారు. ఇందులో ప్రియాంక కీలక పాత్ర చేస్తూండటంతో ఎక్కువ రోజులు డేట్స్ అవసరం అవుతున్నాయి.  కీయాను రీవెస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘మ్యాట్రిక్స్‌’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం. ఆల్రెడీ లాక్‌డౌన్‌ ముందు నటీనటులందరూ యాక్షన్‌ సన్నివేశాల వర్క్‌షాప్‌లో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. ఒక షెడ్యూల్‌ జర్మనీలో జరగిందని సమాచారం. ఈ సినిమా సక్సెస్ అయితే ఇంక ప్రియాంక చోప్రా కెరీర్ కు తిరుగేలేదని అంటున్నారు. హాలీవుడ్ లో మరిన్ని పెద్ద ప్రొడక్షన్స్ ఆమెను తమ సినిమాల్లో తీసుకుంటాయటంలో సందేహం లేదు.

ప్రస్తుతం ప్రియాంక 'సైటడెల్' అనే స్పై సిరీస్ లో నటిస్తోంది. 'టెక్స్ట్ ఫర్ యు' అనే ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ ను పూర్తి చేసింది. బాలీవుడ్‌లో అగ్రనటిగా కొనసాగిన ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లుగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో వివాహం అనంతరం ప్రియాంక అక్కడే సెటిలైపోయింది. అక్కడే హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌ చేస్తూ బిజీగా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios