బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రియాంక అరుళ్ మోహన్, సూపర్ స్టార్ జోడీగా..?
ఈ మధ్య క్లాసిక్ హీరోయిన్లు గా పేరు తెచ్చుకుంటున్న భామలు లక్కీ ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. కీర్తి సురేష్ కూడా ఇలానే సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు ఆ వంతు ప్రియాంకా అరుళ్ మోహన్ ను వరించింది.
నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా తో టాలీవుడ్ తెరకు పరిచయం అయ్యింది ప్రియాంక అరుళ్ మోహన్ అందానికి అందం, నటనకు నటన ఆమె సొంతం. పక్కింటి అమ్మాయిలా సింపుల్ గా ఉంటుంది ప్రియాంక. నటన పరంగాను ఆకట్టుకుంది. గ్యాంగ్ లీడర్ లో ఆమె అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత శర్వానంద్ జంటగా శ్రీకారం సినిమా కూడా చేసింది. అయితే గ్యాంగ్ లీడర్ పర్వాలేదు అనిపించినా... శ్రీకారం మాత్రం డిజాస్టర్ అయ్యింది.
ఇక ఇక్కడ వర్కౌట్ అవ్వదు అనుకుందో ఏమో.. ప్రియాంక తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడే వరుస అవకాశాలను అందుకుంటోంది. అంతే కాదు కోలీవుడ్ లో ఈ బ్యూటీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ నాజూకు భామకు అక్కడ అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.
అయితే అనుకోని విధంగా ప్రియాంకాను ఓ షాకింగ్ ఆఫర్ ఆమె తలుపు తట్టినట్టు తెలుస్తోంది.
తాజాగా మహేశ్ జోడీగా ఈ బ్యూటీని త్రివిక్రమ్ ఎంపిక చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ హీరోగా త్రివిక్రమ్ చేయనున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఇక రెండో హీరోయిన్ గా ముందుగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల పేరు వినిపించింది. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.
హారిక అండ్ హాసిని బ్యానర్ లో నిర్మించబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అగష్ట్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకుని 2023 సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే అన్ని రకాలుగా రెడీగా ఉన్నాడు త్రివిక్రమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు పారెన్ వెకేషన్ లో ఉన్నారు. అది పూర్తి కాగానే ఇండియాకు వస్తారు. వెంటనే సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది.