గతేడాది ముస్తఫా రాజాను వివాహం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు తల్లి కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సమయానికి ఆమె చేతిలో మూడు, నాలుగు కన్నడ సినిమాలు ఉన్నాయి. అక్కడ ఆమె బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. పెళ్లి అయిన తరువాత కూడా నటిగా కంటిన్యూ చేసింది.

తెలుగులో డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు కొంతకాలం పాటు సినిమాలకు, టీవీ షోలకు బ్రేక్ తీసుకోవాలని భావిస్తోందట ప్రియమణి. దానికి కారణం ఆమె తల్లి కాబోతుందని అంటున్నారు.

ఈ వార్తలకు మరింత బలం చేకూరే విధంగా తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో 'త్వరలోనే మా నుండి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుంది. వెయిట్ అండ్ వాచ్' అంటూ తన భర్తతో తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.