ఒక్క కన్ను సైగతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మీడియా ముందుకొచ్చేసింది. ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ఆమె పలికించిన హావభావాలు సంచలనం సృష్టించాయి. తన వీడియోకు వస్తున్న రెస్పాన్స్‌పై నేషనల్ మీడియాతో మాట్లాడింది ప్రియ ప్రకాష్ వారియర్. తను నటించిన సినిమా సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని వెల్లడించింది ప్రియ. అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ.. ఆ ఆనందాన్ని వివరించడానికి మాటలు చాలవంటోంది. కనుబొమలతోనే హావభావాలు పలికించాలన్న డైరెక్టర్ సూచన మేరకే అలా చేశానని చెప్పుకోస్తోంది.

 

మళయాలం, తమిళ్ తో పాటు బాలీవుడ్ నుంచి కూడా నాకు బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ దేనికీ ఇంతవరకూ సైన్ చేయలేదు. అవకాశం వస్తే.. ‘పద్మావతి’ ఫేమ్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో చేయాలన్నది నా డ్రీమ్” అంటూ మనసులో మాటను బైటపెట్టింది ప్రియా వారియర్. ‘వాలెంటైన్స్ డే’కి డేట్‌కి వస్తావా అంటూ చాలామంది ఆమెకి ప్రపోజ్‌ చేశారట. తాను ఇప్పటివరకు ఎవరినీ లవ్ చేయలేదని, చదువుతున్నది గాళ్స్ కాలేజ్‌ కావడంతో అబ్బాయిలతో అటువంటి సమస్యలు వుండవని అంటోంది. ‘వాలెంటైన్ డే’ నాడు తాను కాలేజ్‌కి వెళ్తున్నానని వెల్లడించింది. బాగా చదువుకోవడం, మంచి నటిగా పేరు తెచ్చుకోవడం తన లక్ష్యాలని చెప్పుకొచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్. ప్రియ బర్త్ ప్లేస్ కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా. విమల మహిళల కళాశాలలో బీ.కాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది.