ఆ పిల్లకు తలపొగరు అస్సలు లేదట

First Published 15, Feb 2018, 6:24 PM IST
priya warrior still down to earth after so much craze
Highlights
  • ఒక్క కనుసైగతో ఫేవరైట్ స్టార్ అయిపోయిన ప్రియా వారియర్
  • కంప్ సాంగ్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రియ
  • ముస్లింల నుంచి విమర్శలు వస్తుంటే ప్రియకు హిందువుల మద్దతు
  • తాను మాత్రం స్పందించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రియ

ఒక్కోసారి అదృష్టం అలా తన్నుకుంటూ వస్తుంది. అయితే అదే స‌మ‌యంలో ఏ మాత్రం తేడా చేసినా మొద‌టికే మోసం రావ‌ట‌మే కాదు. ఎంత గుడ్డో.. అంత బ్యాడ్ అయ్యే ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని క‌న్నుగీటు చిన్న‌ది ప్రియా బాగానే గుర్తించిన‌ట్లుంది.

 

ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా కంప్ పాట‌తో హాట్ టాపిక్ గా మారిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న వ‌య‌సులో ఆమె చేసిన ఒక పాట‌కు రాత్రికి రాత్రే భారీ స్టార్ అయిపోయినా.. ఆమె కూల్ గా ఉంటున్నారు. పేరుతో పాటు.. ఫిర్యాదులు రావ‌టంపైనా ఆమె తొంద‌ర‌ప‌డ‌టం లేదు.
 

పొగిడేవాళ్ల‌ను చూసి మురిసిపోవ‌టం.. విమ‌ర్శించే వాళ్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే తీరుకు భిన్నంగా కూల్ గా ఉంటూ సెటిల్డ్ గా రియాక్ట్ అవుతోంది. తాజాగా త‌న పాట‌పై వ‌స్తున్న కంప్లైంట్ మీద రియాక్ట్ అయిన ఆమె.. ఫిర్యాదుల గురించి త‌న‌కు తెలీద‌ని..ఇలాంటి ఇష్యూస్ మీద  కామ్ గా ఉండ‌ట‌మే మంచిద‌ని చెబుతోంది. పాట‌లోని కొన్ని ప‌దాలు ముస్లింల మ‌నోభావాల్ని కించ‌పరిచేలా ఉన్నాయ‌న్న ఫిర్యాదులురావ‌టం తెలిసిందే. 
 

ఊహించ‌ని పాపులార్టీకి ఎలా రియాక్ట్ కావాలో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌ని చెప్పింది. క‌న్నుగీటే సీన్ ను రిహార్స‌ల్స్ చేయ‌కుండానే చేశాన‌ని చెప్పింది. ఏమైనా.. ఇంత స్టార్ డ‌మ్ లోనూ తొంద‌ర‌ప‌డి మాట బ‌య‌ట‌కు రానివ్వ‌ని ప్రియ‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉందంటున్నారు.

loader