కన్నుగీటుతో లక్షలాది ఫాలయర్స్ ను సంపాదించుకున్నప్రియా వారియర్ కూడా శ్రీదేవి అభిమానే. శ్రీదేవి పార్థీవ దేహం ఇండియాకు రావడంలో జరిగిన ఆలస్యానికి బాధ పడిన వాళ్ళలో ప్రియా వారియర్ కూడా ఒకరు. ఈ విషయాన్ని తనే స్వయంగా షేర్ చేసుకుంది. కభి అల్విదా నా కెహెనా అంటూ విషాద స్వరంతో తనే స్వయంగా ఆలపించిన పాటను వీడియో రూపంలో ప్రియా పోస్ట్ చేసింది. శ్రీదేవి ఒక వ్యక్తి కాదు చరిత్ర అన్న ప్రియా తనకు గుడ్ బై ఉండదని ఇది కేవలం మళ్ళి కలుసుకోవడానికి సంకేతం అనే అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టడం తన ఫ్యాన్స్ నే కాక శ్రీదేవి అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.తన అల్ టైం ఫేవరేట్ శ్రీదేవినే అని చెప్పిన ప్రియా వారియర్ తన హృదయంలో ఆవిడ ఎప్పుడు జీవించే ఉంటారని తన ప్రేమను బయట పెట్టుకుంది. ప్రియా అనే కాదు ప్రస్తుతం కోట్లాది అభిమానుల గుండెల్లో ఉన్న మాటనే ప్రియా ఇలా పాట రూపంలో చెప్పింది. మరి కొద్ది నిమిషాల్లో శ్రీదేవి అంత్యక్రియలు పూర్తైపోతాయి. ఆ తర్వాత శ్రీదేవి కేవలం ఒక జ్ఞాపకంగా మిగలనున్నారు.. కాని సినిమాల్లో ఎవరికి సాధ్యం కాని విభిన్న పాత్రలతో అభిమానుల ప్రేమను గెలుచుకున్న శ్రీదేవికి నిజంగానే వీడ్కోలు లేదు. ఎందుకంటే తను ఎప్పటికి మనతోనే హృదయాల్లో సజీవంగా ఉంటుంది కనక. ప్రియా వారియర్ శ్రీదేవికి నివాళి అర్పించడం ద్వారా ఇంకా ఎందరో హృదయాలను గెలుచుకుంది.