Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 24 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో తులసి నిద్రలేవగా పక్కనే నందు పడుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. సూర్యోదయం అయినా నిద్ర లేవలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నందుని నిద్ర లేపుతుంది. అప్పుడు నందు అప్పుడు నిద్ర లేచావా ఇంకో కొద్దిసేపు పడుకో అని అంటాడు. వెంటనే తులసి వంటింట్లో పని ఉంది అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా అనగా రాములమ్మ ఉంది ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఆ పని వాళ్ళు చేసుకుంటారు లే తులసి అని అంటాడు నందు. నాకు జ్వరం తగ్గింది అనగా జ్వరం తగ్గిన నీరసం తగ్గదు కదా కాబట్టి రెస్ట్ తీసుకో రాత్రంతా మూసిన కన్ను తెరవకుండా పడుకున్నావు అని అంటాడు నందు.

అయినా మీరు రాత్రంతా నాకోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు దివ్య ఉంది కదా అనగా దివ్య కంటే మీపై నీ మీద నాకు ఎక్కువ బాధ్యత ఉంది అని అంటాడు. నీ భయం నాకు అర్థమైంది తులసి అనగా అది భయం కాదు ఇబ్బంది అని అంటుంది. ఆ తర్వాత దివ్య నిద్ర లేవగానే విక్రమ్ తలుచుకొని సంతోష పడుతూ ఉంటుంది. ఎంత మనసు కంట్రోల్ చేసుకుందామనుకుంటున్నా మనసు మీ దగ్గరికి పారిపోయి వస్తోంది అని సిగ్గుపడుతూ ఉంటుంది దివ్య. కాస్త జాగ్రత్తగా చూసుకో మనసు లేకుండా నేను ఉండలేను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ నువ్వు లేకుండా నా మనసు ఉండలేకపోతోంది అని అనుకుంటూ ఉంటుంది దివ్య. విక్రమ్ ఫోటో చూస్తూ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తుంది.

ఆ తర్వాత అనసూయ సంతోషంగా కనిపిస్తుండగా ఎందుకు అత్తయ్య అంత సంతోషం అనడంతో మీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్ తులసి అని అంటుంది. అప్పుడు తులసి మనకు కంటికి కనిపించేది ఏది నిజం కాదు అత్తయ్య అని బాధగా మాట్లాడడంతో అనసూయ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే వాసుదేవ్, ఇందు వచ్చి తులసినీ పరామర్శిస్తూ ఉంటారు. అప్పుడు తులసి ఈ ఆఫీస్ ఫైల్స్ అన్ని చూడాలి ఇప్పుడు మేనేజర్ వస్తాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగా అదేంటి నందు నైట్ అంతా కూర్చొని ఫైల్స్ అన్ని క్లియర్ చేశారు కదా అని అంటాడు వాసుదేవ్. ఇంకా ఉన్నాయా అనగా అప్పుడు తులసి ఫైల్స్ అన్ని చూసి అన్ని అయిపోయాయి అని ఆశ్చర్య అయిపోతుంది.

నీకోసం అన్నయ్య ఎంత కష్టపడ్డాడో చూసావా ఇప్పుడు నీ కోసం కాఫీ కూడా పెడుతున్నారు వదిన అనడంతో తులసి షాక్ అవుతుంది. నందు గొప్పతనం గురించి తులసి గొప్పతనం గురించి వాసుదేవ్ అతని భార్య మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు విక్రమ్ రెడీ అవుతూ ఉండగా ఇంతలో దివ్య గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేయడంతో ఆనందంతో ఎగిరి డాన్సులు వేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న దేవుడికి ఆ విషయం చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. ఈరోజు దివ్య ని కలిసి నా మనసులో మాట బయటకు చెప్పేస్తాను అని అంటాడు. అప్పుడు విక్రమ్ సంతోష పడుతుండగా ఇంతలో రాజ్యలక్ష్మి వస్తుంది అని దేవుడు చెప్పడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు.

అప్పుడు రాజ్యలక్ష్మి మన మామిడి తోట దగ్గరికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండిరా అని చెప్పడంతో విక్రం చేసేదేమీ లేక సరే అమ్మ అని అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో విక్రం బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఇప్పుడు దివ్య అమ్మ పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇవ్వద్దు కాల్ చేసిన కూడా లిఫ్ట్ చేయొద్దు దివ్యమ్మనీ ఎన్ని రోజులు అవాయిడ్ చేయండి అనడంతో నా మీద కోపం పెంచుకుంటుందేమో అనడంతో అయినా పర్లేదు బాబు మీరు దగ్గర అవ్వాలంటే ఇలా చేయాల్సిందే అని దేవుడు సలహా ఇస్తాడు. అప్పుడు దివ్య ఫోన్ చేసినా కూడా దివ్య ఫోన్ వైపు చూసి స్వారీ దివ్య అనుకుంటూ ఉంటాడు విక్రమ్. మరోవైపు విక్రమ్ ఏం చేస్తున్నాడు అనుకుంటూ దివ్య ఆలోచిస్తూ ఉంటుంది.

అప్పుడు తననీ తాను అద్దంలో చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి నందు కి థాంక్స్ చెప్పగా నాకోసం ఎన్నో చేశావు నేను థాంక్స్ చెప్పలేదు అనగా థాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అప్పట్లో మన మధ్య బంధం ఉంది ఇప్పుడు ఆ బంధం లేదు అని అంటుంది తులసి.. ఇప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే మేనేజర్ రావడంతో తులసి ఆ ఫైల్స్ ఇచ్చి పంపిస్తుంది. తర్వాత దివ్య కాఫీ తాగుతూ ఉండగా ఇంతలోనే హాస్పిటల్ లో పనిచేసే నర్స్ ప్రియ అక్కడికి వస్తుంది. మేడం మీరు నన్ను సంజయ్ ని ఒకటి చేయాలి ఆ విషయంలో హెల్ప్ చేస్తారని మీ దగ్గరికి వచ్చాను అనగా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు ప్రియ అనగా మా ఇద్దరికీ మీరే పెళ్లి జరిపించాలి మేడం అని అంటుంది.

సంజయ్ చేతిలో మోసపోయాను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి నన్ను మోసం చేశాడు అని అంటుంది. ఇప్పుడు నాకు రెండో నెల ప్రెగ్నెంట్ ని అదిగో ఇదిగో అంటూ మాట దాటేస్తున్నాడు కానీ పెళ్లి చేసుకోవడం లేదు అని అంటుంది. ఇప్పుడు గట్టిగా నిలదీస్తే పెళ్లి చేసుకోను అబార్షన్ చేయించుకో కావాలని డబ్బులు ఇస్తాను అంటున్నాడు మేడం అనగా చేయించుకో అనీ దివ్య కూడా అనడంతో ఏంటి మేడం మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు అని అంటుంది ప్రియ. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా అమ్మ నాన్న చనిపోతారు అనగా ఆ విషయం నీకు ఇంతకుముందు గుర్తు రాలేదా అని అంటుంది దివ్య.

ప్రేమించాను అని మోసం చేశాడు మేడం అనగా ప్రేమించిన వాడు ఎవడు కూడా పెళ్లికి ముందు ఇలా కాలు జారడు అని అంటుంది. అసలు మోసం చేయడం అతని తప్పు కాదు మోసపోవడం నీ తప్పు అయినా అంత పెద్ద హాస్పిటల్ ఓనర్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు అని అంటుంది దివ్య. నేను తప్పు చేశాను ఎలా అయినా మీరు రాజ్యలక్ష్మి తో మాట్లాడి నాకు సంజయ్ కీ పెళ్లి చేయించండి మేడం అనగా రాజ్యలక్ష్మి తో మాట్లాడిన కూడా ఆమె తన కొడుకుకి అనుగుణంగా మాట్లాడుతుంది అని అంటుంది దివ్య. మరి ఇప్పుడు ఏం చేయాలి మేడమ్ అనడంతో దివ్య ఆలోచనలో పడుతుంది.