మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు సినిమాల్లో చాలా అవకాశాలే వస్తున్నాయి. టాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ని బలపరుచుకుంటోంది.

ఇటీవల 'లవర్స్ డే' సినిమా ఆడియో ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ భామ ఇప్పుడు ఇక్కడ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నానితో రోమాన్స్ చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. విక్రం కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఒక హీరోయిన్ గా మేఘా ఆకాష్ ని ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ ని ఫైనల్ చేశారట. మరో ముగ్గురు హీరోయిన్లను కూడా వచ్చే నెల లోపు ప్రకటించబోతున్నారని సమాచారం.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాని ప్లే బాయ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని సమాచారం.