కన్ను గీటిన ఒక్క వీడియోతో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువత మొత్తం ఆమెకు దాసోహమయ్యారు. ప్రియా వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రియవారియర్ బాలీవుడ్ నటించిన చిత్రం 'శ్రీదేవి బంగ్లా'.

ఈ చిత్రంపై శ్రీదేవి భర్త బోనికపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో శ్రీదేవి మరణించిన తరహాలో బాత్ టబ్ లో కొన్ని సన్నివేశాలు చిత్రికరించడంతో వివాదం మొదలయింది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ప్రియా వారియర్ తాజాగా స్పందించింది. 

ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు, నిర్మాతలు అవకాశం ఇచ్చారు. నటిగా నా పని నేను చేశా. దర్శక నిర్మాతలకు సంబంధించిన విషయం ఇది అని ప్రియా వారియర్ తెలిపింది. వ్యక్తిగతంగా ఎవరిని భాదపెట్టాలనే ఉద్దేశం తమ చిత్ర యూనిట్ కు లేదని ప్రియా వారియర్ తెలిపింది. 

ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీదేవి మేడంకు నేను పెద్ద అభిమానిని. ఆమెని కించపరచాలనే ఉద్దేశం ఎవరికీ లేదు అని ప్రియా మీడియాకు తెలిపింది. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ బాత్ టబ్ లో పడి మరణించిన సంగతి తెలిసిందే.