సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ రీసెంట్ గా యంగ్ హీరో విజయ్ దేవరకొండని కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోని ప్రియా ప్రకాష్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకి 'నువ్వంటే నాకు చాలా ఇష్టం' అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఈ ఫోటోకి ఇప్పటివరకు మూడున్నర లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇంకా ఆ నెంబర్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు క్రేజీ సెలబ్రిటీలు కలిసి తీసుకున్న ఫోటో ఆ మాత్రం వైరల్ అవ్వడం కామన్.

'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటలో కన్నుకొడుతూ  కనిపించి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ప్రియా. ఆమె నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం బాలీవుడ్ లో 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమాలో నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Nuvvante naaku chala ishtam😋

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Aug 7, 2019 at 11:10pm PDT