శ్రీనివాస కళ్యాణం చిత్రం ఇచ్చిన షాక్ తర్వాత నితిన్ ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువవుతుందనుకున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం దారుణంగా నిరాశపరిచింది. దీనితో తదుపరి చిత్రాల విషయంలో నితిన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. నలుగురు దర్శకుడు నితిన్ కోసం క్యూలో ఉన్నారు. ముందుగా ఏ చిత్రం ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. 

విభిన్న చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో నితిన్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో నితిన్ కు హీరోయిన్ గా యూట్యూబ్ సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రం కోసం ప్రియా వారియర్ ని సంప్రదించగా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఒకే ఒక్క వీడియోతో ప్రియా వారియర్ దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. కుర్రకారు హృదయాలు కొల్లగొట్టేలా ప్రియవారియర్ కన్నుగీటిన వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

ఈ వీడియోతో ఒరు ఆధార్ లవ్ చిత్రానికి ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. కానీ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో ప్రియా వారియర్ తన క్రేజ్ కు తగ్గ ఆఫర్స్ అందుకోలేకపోయింది. తాజాగా నితిన్ తో నటించే అవకాశం రావడం ప్రియా వారియర్ కు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.